శాతకర్ణి తల్లి.. కళ్లలోనే పండిస్తోంది

టాలీవుడ్ లో ఇప్పుడు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు చాలానే సెట్స్ పై ఉన్నాయి. వీటిన్నిటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి గురించే. అభూత కల్పనలు.. జానపదాలు.. కమర్షియల్ యాంగిల్స్ లాంటి వాటిని పట్టించుకోకుండా.. తెలుగు చరిత్రకు సంబంధించిన ఓ మహనీయుడైన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణిని తెరపైకి తెస్తున్నాడు బాలయ్య. ఈ మూవీలో రాజమాత తల్లి గౌతమి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండడంతోనే బాలీవుడ్ నటి హేమమాలిని తీసుకున్నారు.

ఇప్పుడు హేమమాలిని చేస్తున్న గౌతమి పాత్రకు సంబంధించిన లుక్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. నిండైన చీరకట్టు.. హాఫ్ వైట్ శారీకి జరీ బోర్డర్.. నుదుటన విభూది.. సగం నెరిసిన జుట్టు.. చేతికి కంకణం.. వేలుకి ఉంగరం.. అతి తక్కువ ఆర్నమెంట్స్.. అన్నిటికీ మించి హేమమాలిని గంభీరమైన వదనం. ఈ హేమమాలిని పోస్టర్ ను అఫీషియల్ ఫస్ట్ లుక్ అనడం లేదు కానీ.. కాదనేందుకు ఏ మాత్రం ఆస్కారం లేదు. పైగా ఆమె కంటిలో కనిపిస్తున్న గాంభీర్యం చూస్తుంటే.. వాటిలో కనిపిస్తున్న సెంటిమెంట్ చూస్తుంటే.. శాతకర్ణి తల్లి పాత్రకు ఆమెనే ఏరికోరి ఎందుకు తెచ్చుకున్నారో అర్ధమవుతుంది.

బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో ప్రతీ పాత్రకు తగిన నటులనే ఎంపిక చేసుకున్నాడట దర్శకుడు క్రిష్. ఆ విషయం ఒక్కో లుక్ ద్వారా ఆడియన్స్ కి తెలియచెప్పేస్తారట కూడా.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.