వారణాసిలో తొక్కిసలాట: 19 మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాబా జై గురుదేవ్ సభ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జ్రగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకూ 19 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నారు. అయితే గాయపడినవారిలో 12 మంది పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తోంది. వారణాశి – చందౌలీ మధ్య ఉన్న రాజ్ ఘాట్ వంతెన పై ఈ సంఘటన చోటు చేసుకుంది. 3000 మందికి మాత్రమే అనుమతి ఉన్న బాబా జై గురుదేవ్ కార్యక్రమానికి దాదాపు 70వేల మంది హాజరవ్వడమే ఈ దుర్ఘటనకు కారణంగా తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాదానికి సంబందించిన సమాచారం అందుకున్న వెంటనే అక్కటికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

ఇదే సమయంలో బాబా జై గురుదేవ్ ఆధ్యాత్మిక సభ సందర్భంగా తొక్కిసలాట దుర్ఘటన గురించి తెలియగానే గోవాలోని బ్రిక్స్ సభలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా ఘటనలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు.

Categories: Political News

Leave A Reply

Your email address will not be published.