రాక్షసి చేతుల్లోనూ మ్యాజిక్ ఉందట

‘నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది’.. రీసెంట్ గా ప్రేమమ్ మూవీలో బాగా క్లిక్ అయిన డైలాగ్ ఇది. శృతి హాసన్ చెప్పే ఈ ఒక్క మాట.. ఆమెతో లవ్ ఫెయిల్యూర్ తర్వాత నాగచైతన్యకు లైఫ్ ను ఇస్తుంది. అలాంటి మ్యాజిక్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి చేతుల్లోనూ ఉందని అందరూ అంటున్నారట.

‘రీసెంట్ గా ఊటీలో వరుణ్ తేజ్ తో మిస్టర్ మూవీ చేస్తున్న సమయంలో మా అమ్మకు డెంగ్యూ ఫీవర్ అంటూ డెహ్రాడూన్ నుంచి ఫోన్ వచ్చింది. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నా.. మా అదృష్టం-దేవుడి దయ కొద్దీ ఆమె క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఆమె హాస్పిటల్ లో ఉన్న సమయంలో నేనే ఫుడ్ ప్రిపేర్ చేసి పంపాను. అచ్చం తను చేసినట్లే ఉందంటూ అమ్మ చాలా సంతోషించింది. గతంలో అసలు నాకు వంట రాదు. కానీ నేను ముంబైలో ఉన్నపుడు ప్రయోగాలు చేసేదాన్ని. పానీ పూరీ సమోసా సలహా అన్నీ ఇంట్లోనే చేసేసేదాన్ని. ఆ ప్రిపరేషన్ ఇప్పుడు బాగా ఉపయోగపడింది. నా చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందని అందరూ అనేస్తున్నారు’ అంటోంది లావణ్య త్రిపాఠి.

సందర్భం సంతోషించేది కాకపోయినా.. ఫ్యామిలీతో కలిపి గడపడం చాలా హ్యాపీగా ఉంది అంటోంది లావణ్య. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్స్ లో పాల్గొంటున్నా మళ్లీ దీపావళికి కచ్చితంగా ఇంటికి వెళతానని చెబుతోందీ నార్త్ ఇండియన్ భామ.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.