ముద్దుల జంట మరీ రెచ్చిపోతున్నారు

గత కొన్నినెలలుగా బాలీవుడ్ లో ఓ జంట పెట్టుకుంటున్న ముద్దుల గురించి హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బేఫికర్ మూవీ కోసం రణవీర్ సింగ్.. వాణి కపూర్ లు రకరకాల యాంగిల్స్ లో లిప్ లాక్స్ లాగించేయడం.. సెన్సేషన్ అయింది. ఇదంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిన హంగామా అయితే.. ఈ మధ్య ఫోటో షూట్స్ కోసం మరీ పోర్న్ స్టార్స్ ని మరిపించేస్తూ మరో షాక్ ఇచ్చేశారు.

బజార్ మేగజైన్ కోసం బ్రైడ్ ఎడిషన్ లో భాగంగా కవర్ పేజ్ పై పోర్న్ సినిమాల టైపులో రెచ్చిపోయి కనిపించిన ఈ జంట.. లోపలి పేజీల్లో కూడా ఏ మాత్రం తగ్గలేదు. విండోను ఆనుకుని.. కాలు ఆ విండో పెట్టి రణవీర్ పోజులిస్తే.. వీలైనంత దగ్గరగా అతుక్కుపోయిన వాణి కపూర్.. తమ మధ్య గాలి ఆడకూడనంత క్లోజ్ గా నుంచుంది. వీటికి తోడు తను వేసుకున్న బ్రా.. దాని డిజైన్ ప్రముఖంగా కనిపించేలా కోట్ బటన్స్ విప్పేసింది లెండి. ఇదంతా ఆ ఇన్నర్ వేర్స్ కి ప్రచారం కోసమే అన్నది సెకండ్ పాయింట్.

ఈ ప్రచారం సినిమాకి ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారో.. సినిమా పేరు చెప్పి ఇలా డిఫరెంట్ గా క్రేజ్ పెంచుకోవాలని అనుకుంటున్నారో అర్ధం కాదు కానీ.. ఏ టైపులో చూసినా… వీళ్ల కాన్సెప్ట్ రెచ్చగొట్టడమే అనే విషయం అర్ధమైపోతోంది. ఈ పోర్న్ టైపు ప్రచారం ఎవరికి ఎలా కలిసొస్తుందో చూడాలి.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.