భాస్కర్ సినిమాలో అల్లు హీరోస్ కాదుగా

బొమ్మరిల్లు మూవీతో టాలీవుడ్ లో ఓ స్టాంప్ వేసేశాడు డైరెక్టర్ భాస్కర్. ప్రేమ కథా చిత్రాల్లో ట్రెండ్ సృష్టించేశాడు. ఆ తర్వాత పరుగు కూడా సక్సెస్ సాధించడంతో.. టాప్ లీగ్ లోకి వెళ్లిపోతాడని అనుకుంటే.. రామ్ చరణ్ తో ఆరెంజ్.. రామ్ తో ఒంగోలు గిత్త గట్టిగానే షాక్ ఇచ్చాయి. ఆ తర్వాత కోలుకునేందుకు చాలానే టైం తీసుకుని రీసెంట్ గా బెంగళూరు డేస్ తమిళ్ రీమేక్ చేశాడు కానీ.. పెద్దగా ఒరిగిందేమీ లేదు.

ఈ దర్శకుడు ఇప్పుడు మళ్లీ కొత్తగా బౌన్స్ బ్యాక్ కానున్నాడని టాక్. ఇందుకు అల్లు టీమ్ నుంచే సపోర్ట్ వస్తుండడం విశేషం. ఓ మాంచి లవ్ స్టోరీతో స్క్రిప్ట్ ప్రిపేర్  చేసుకుని అల్లు అరవింద్.. బన్నీలకు వినిపించాడట భాస్కర్. గతంలో పరుగు లాంటి సక్సెస్ ఇచ్చిన భాస్కర్ పై అల్లు టీమ్ కి మంచి అభిప్రాయమే ఉండడంతో.. ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అయితే.. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మించినా.. లీడ్ రోల్ లో మాత్రం అల్లు ఫ్యామిలీ హీరోస్ నటించడం లేదట.

నాగ చైతన్య కానీ.. నాని కానీ ఈ సినిమాలో హీరోగా నటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే హీరోలతో సంప్రదింపులు మొదలైపోగా.. లీడ్ కేరక్టర్ ని నిర్ణయించగానే.. సెట్స్ పైకి వెళ్లిపోయేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. భాస్కర్ దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం భాస్కర్ కి నడుస్తున్న బ్యాడ్ టైమ్ లో.. ఇది గోల్డెన్ ఛాన్స్ అనాల్సిందే.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.