నేచురల్ స్టార్ ని గుర్తుపట్టారా?

ఫేస్ బుక్ – ట్విట్టర్ లు వచ్చిన తర్వాత సెలబ్రెటీలకు వారి అభిమానులకు దూరం చాలా వరకూ తగ్గిపోయింది. ఉదాహరణకు అప్పట్లో ఒక సినిమా హీరోని – సినీ నటులను చూడాలన్నా – వారి మాటలు వినాలన్నా కచ్చితంగా వార్తా పత్రికలో – న్యూస్ చానల్లో చూడాల్సి వచ్చేది. అది కూడా వారితో నేరుగా కాంటాక్ట్ అవ్వడానికి అనుకూలించేది కాదు. ఎప్పుడీతే సోషల్ నెట్ వర్క్ సైట్స్ వచ్చాయో… ఏమాత్రం అవకాశం ఉన్నా సెలబ్రెటీలంతా వారి వారి అభిమానులకు అందుబాటులో ఉండటానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. తాజాగా హీరో నానీ కూడా అభిమానులకు టచ్ లో ఉండటానికి తనవంతు ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా చేస్తున్నాడు.

అందులో భాగంగా అభిమానుల కోసం తన ఫేస్ బుక్ నుంచి ఒక పాత ఫోటోను పోస్ట్ చేసి… చిన్న పరీక్ష పెట్టాడు. “ఈ ఫోటోలో నేను ఎక్కడున్నానో చెప్పగలరా” అంటూ అభిమానులను ప్రశ్నించాడు. ఇదే సమయంలో ఈ ఫోటోచుస్తే ఒక పుట్టినరోజు వేడుకలో తీసుకున్నదని తెలుస్తోంది. దీంతో నేచురల్ స్టార్ అయిన నానిని కనుక్కోవడం చాలా సులభమంటూ అభిమానులు కూడా ఆ ఫోటోకు భారీగానే కామెంట్లు పెడుతున్నారు. సహజమైన నటన కలిగిన నానీది ఎప్పుడూ సహజమైన చిరునవ్వే అని అలాంటి నానిని గుర్తుపట్టేయడం పెద్ద కష్టమేమి కాదని మరో అభిమాని తెలిపాడు. ఇదే సమయంలో… నానిని గుర్తు పట్టాము కానీ కెమెరా వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తున్నావ్ అంటూ మరో అభిమాని పోస్ట్ చేశాడు. మీరు కూడా ప్రయత్నించండి… మీరైతే “బ్లూ చెక్స్ షర్ట్ వేసుకుని పక్కకు చూస్తున్న అబ్బాయి” అని ఇట్టే చెప్పేస్తారు!

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.