నందమూరి బ్రదర్స్.. అనుబంధం అదుర్స్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఇజం గత నెలలోనే షూటింగ్ ఫినిష్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేసుకున్నారు. నిజానికి పూరీ-కళ్యాణ్ రామ్ ల ఇజం దసరా రేస్ లోనే ఉండాల్సింది. కానీ సీజన్ లో గట్టి పోటీ ఉండడంతో.. ఓ వారం వెనక్కు వెళ్లింది. ఆ లెక్కన కూడా ఈ పాటికే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. దీన్ని మరో వారం పోస్ట్ పోన్ చేసి అక్టోబర్ 21న ఫిక్స్ చేయడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది.

వచ్చే గురువారంతో జనతా గ్యారేజ్ మూవీ 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఇలాంటి టైమ్ లో ఇజం ను రిలీజ్ చేస్తే.. జనతా గ్యారేజ్ ను చాలాచోట్ల థియేటర్ల నుంచి తీసేయల్సి వస్తుంది. అందుకే ఎన్టీఆర్ కోసం ఇజం రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. చాలా ఏరియాల్లో ఇజంను డిస్ట్రిబ్యూట్ చేయనున్న వారంతా గతంలో గ్యారేజ్ ను రిలీజ్ చేసిన వాళ్లే. ఇజం విడుదల విషయంలో ఎదురైన కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎన్టీఆర్ దగ్గరుండి క్లియర్ చేశాడు. రీజనబుల్ రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసేలా స్టెప్స్ తీసుకున్నాడు.

గతంలో కిక్2 రిలీజ్ కి కూడా కళ్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ సహాయం చేశాడు. అందుకే జనతా గ్యారేజ్ మూవీ అర్ధ శతదినోత్సవం కోసం తన సినిమా వాయిదా వేసుకున్నాడీ నందమూరి హీరో. ఇంత చేసినా ఇజం విషయంలో కళ్యాణ్ రామ్ కు 6 కోట్ల లాస్ అంటున్నారు. మంచి టాక్ వస్తే మాత్రం.. రీమేక్- శాటిలైట్ రూపంలో ఈ నష్టం భర్తీ అయ్యే ఛాన్సులున్నాయి.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.