ధోనీని అతని గర్ల్ ఫ్రెండ్ ని కలవలేదట!

“లోఫర్” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన దిశాపటానీ ప్రస్తుతం బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ – ది అన్ టోల్డ్ స్టోరీ భారీ విజయం సాధించడంతో ఆ సంబరాల్లో మునిగి తేలుతోంది. తొలిసినిమానే ఈ రేంజ్ లో హిట్ అవ్వడంతో అమ్మడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. కాగా ఈ సినిమాలో ధోనీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక ఝూ పాత్రలో నటించింది దిశాపటాని.

సాధారణంగా నిజజీవితంలోని పాత్రలను తెరకెక్కించేటప్పుడు ఆ పాత్రలను నిశితంగా పరిశీలించడం లేదా ఆయా వ్యక్తులతో కలిసి కొంతకాలం ప్రయాణించడం జరుగుతుంటుంది. అయితే ధోనీ గర్ల్ ఫ్రెండ్ పాత్ర విషయంలో దిశా పటాని అలాంటివేమీ చేయలేదట. ఈ పాత్రకోసం ప్రియాంకను కాని ధోనీని కానీ కలవలేదని చెబుతుంది దిశ. ఈ పాత్ర ఇంత నేచురల్ గా రావడానికి కేవలం దర్శకుడు నీరజ్ చెప్పినట్లు చేయడమొకటే కారణమని తెలిపింది.

ప్రస్తుతం ధోనీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక ఝూ పాత్రలో చక్కగా ఒదిగిపోయిందనే ప్రశంసలు పొందుతున్న దిశాను తెలుగులో లోఫర్ సినిమా తర్వాత అవకాశాలు రాలేదా అని అడిగితే… ఆ సినిమా తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయని అయితే కేవలం అందంగా కనిపిస్తే చాలు అనుకునే పాత్రలు తాను చేయనని కచ్చితంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలే చేస్తానని ఆ విషయంలో ఏ భాష అయినా తనకు ఓకే అని చెబుతుంది దిశాపటాని.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.