చైతూ-వైట్ల.. ఓకే అయిందటగా

అక్కినేని నాగాచైతన్య ప్రస్తుతం మామూలు రైజింగ్లో లేడు. ‘ప్రేమమ్’ విడుదల కాకముందే అతను కొత్తగా మూడు సినిమాల దాకా కమిటయ్యాడు. ఇక ‘ప్రేమమ్’ సూపర్ హిట్ అయ్యేసరికి చైతూలో మరింత ఊపొచ్చింది. అతడి కోసం చాలామంది రచయితలు.. దర్శకులు లైన్లోకి వచ్చేశారు. వారిలో శ్రీను వైట్ల కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ సినిమాను తెరకెక్కిస్తున్న వైట్ల.. తన తర్వాతి చిత్రాన్ని చైతూతోనే చేయాలనుకుంటున్నాడట.

ఈ మధ్యే నాగార్జునకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట వైట్ల. నాగ్ తో ఇంతకుముందు ‘కింగ్’ లాంటి హిట్ మూవీ తీశాడు వైట్ల. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో సినిమా చేయొచ్చన్న ప్రచారం జరిగింది కానీ… అది కార్యరూపం దాల్చలేదు. ఐతే వైట్లపై ప్రస్తుతం ఫ్లాప్ డైరెక్టర్ అన్న ముద్ర ఉన్నా.. ‘మిస్టర్’ ఫలితం ఇప్పుడే తెలిసే అవకాశం లేకపోయినా.. స్క్రిప్టు నచ్చి చైతూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాగ్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తారని సమాచారం.

చైతూ ఇప్పటిదాకా స్టార్ కమర్షియల్ డైరెక్టర్లతో పని చేసింది లేదు. వైట్లతో అతడి కాంబినేషన్ కొంచె వెరైటీనే. త్వరలోనే ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్న చైతూ.. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమాకు పని చేస్తాడు. వీటితో పాటు సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో కృష్ణ అనే యువ దర్శకుడితో పంజాబీ మూవీ ‘సింగ్ వెర్సస్ కౌర్’ కూడా చేయాల్సి ఉంది. మరోవైపు ‘2 స్టేట్స్’ రీమేక్ కు కూడా చైతూ పేరే వినిపిస్తోంది.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.