ఆమెపై అంత కోపమేమిటి అమీర్!

సాదారణంగా సినిమాల్లో నటీనటులకు సంబందించిన ఫైనల్ జడ్జిమెంట్ అప్పట్లో దర్శకనిర్మాతలకు మాత్రమే ఉండేదని ఈ విషయంలో కాస్త సీనియర్ నటులైతే వారి అభిప్రాయాలను కూడా గౌరవించి నాయికలను ఎంపిక చేసేవారని అంటుంటారు. కాసేపు ఆసంగతులు పక్కనపెడితే ఒక హీరోయిన్ ని తన సినిమాల్లోకి తీసుకునే విషయంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అడ్డుపడుతున్నాడట. ఈ విషయంలో నిర్మాత చెప్పినా కూడా ఆమె వద్దంటే వద్దు అని పట్టుపట్టి కూర్చున్నాడట. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.. ఏమిటా కథ ఇప్పుడు చూద్దాం.

తాజాగా యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేస్తోంది “బేఫికర్” ట్రైలర్. ఈ ట్రైలర్ ద్వారా హీరోయిన్ వాణి కపూర్ సృష్టిస్తోన్న అలజడి అంతా ఇంతా కాదు. అటు అందం విషయంలోనూ ఇటు అభినయం విషయంలో కూడా వాణికపూర్ కి మంచి పేరే ఉంది. “శుద్ధ్ దేశీ రొమాన్స్” సినిమాలో అయితే ఆమె పెర్ఫామెన్స్ ను అభినందించనివారు లేరన్నా అతిశయోక్తి కాదేమో. ఆ సినిమాలో ఆమె చూసి వాణి ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్నారు కానీ ఎందుకో టాప్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. అయితే టాప్ హీరోయినా కాదా అనే విషయాలు పక్కనపెడితే… యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రాకు మాత్రం ఆమె నటన బాగా నచ్చేసిందట – ఆమె అభినయం – కమిట్ మెంట్ ఆయనకు బాగా ఇష్టమట. దీంతో తమ బేనర్లో తొలి సినిమా చేసినపుడే మరో రెండు సినిమాలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.

దాంతో ఎనిమిదేళ్ల తర్వాత తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోయే “బేఫికర్”లోనూ అవకాశమిచ్చాడు. ఈ సినిమాలో ఆమె చూపించిన ప్రతిభకు మెచ్చిన ఆదిత్య తమ బేనర్లో అమీర్ ఖాన్ – అమితాబ్ బచ్చన్ ల క్రేజీ కాంబినేషన్లో తీయబోయే “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్”లోనూ వాణికి అవకాశం ఇవ్వాలని భావించాడు. దీంతో వాణితో ఉన్న రెండో సినిమా కాంట్రాక్ట్ కూడా పూర్తిచేయొచ్చనేది ఆయన ఫీలింగ్ కావొచ్చు. అయితే ఈ విషయంలో అమీర్ ఖాన్ మాత్రం వాణి కపూర్ ని హీరోయిన్ గా వద్దే వద్దు అనేశాడట. తన పక్కన నటించడానికి వాణి స్టేచర్ సరిపోదని పైగా ఆమె హైట్ తో కూడా సమస్య రావచ్చని అన్నాడట. సరేకే.. హైట్ విషయం మేనేజ్ చేద్దామని ఆదిత్య చోప్రా చెప్పినా కూడా అమీర్ మాత్రం పట్టిన పట్టు విడవకుండా… ఆమె వద్దే వద్దని ఆమె స్థానంలో మరో టాప్ హీరోయిన్ ను చూడమని అన్నాడట. దీంతో చేసేదేమీ లేక ఆదిత్య వేరే ఆప్షన్ చూస్తున్నాడట.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.