‘అమ్మ’ను నేరుగా కలవనందుకు ఫీలయ్యాడు

గడిచిన మూడు వారాలకు పైనే చెన్నై అపోలో ఆసుపత్రి చికిత్స పొందుతున్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు పరామర్శల పర్వం మొదలైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి వరకూ వెంటిలేటర్ల మీద ఉన్న ఆమెకు.. రెండుక్రితమే వెంటిలేటర్లు తొలగించారని.. పేపర్లు చదువుతున్నారని.. ఆసుపత్రి వర్గాలతో నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇందులో వాస్తవం ఎంతన్నది మాత్రం బయటకు రావటం లేదు. ఎందుకంటే..  అమ్మ ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వార్తలు మొత్తం అనధికారమైనవే తప్పించి.. అధికారికమైనవి ఏమీ లేవు.

ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య చెన్నైకి వెళ్లారు. అమ్మచికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. అన్నాడీఎంకే పార్టీ నేతల్ని కలిశారు. అమ్మ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆమెను నేరుగా చూసే అవకాశం లేకపోవటంపై కాస్తంత ఆవేదనకు గురయ్యారు. తాను జయలలితను నేరుగా కలుద్దామని అనుకున్నా.. వైద్యులు అంగీకరించకపోవటంతో పార్టీ నేతలతో మాట్లాడి వచ్చినట్లుగా వెల్లడించారు. ఆమెను ప్రత్యక్షంగా కలవలేకపోయినట్లుగా వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. అమ్మను పరామర్శించటానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి అమ్మాల్ కూడా అపోలో ఆసుపత్రికి వచ్చారు. జయలలిత స్నేహితురాలు శశికళను కలిసి జయ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అమ్మాల్ వెంట.. మాజీ కేంద్రమంత్రి.. కరుణ కుమార్తె కనిమొళి కూడా ఉన్నారు. శనివారం.. డీఎంకే నేత స్టాలిన్ తో సహా పలువురు డీఎంకే సీనియర్ నేతలు కూడా వెళ్లనున్నారు.

Categories: Political News

Leave A Reply

Your email address will not be published.