అనుష్క సీజన్ మళ్లీ స్టార్ట్ అవుతోంది

టాలీవుడ్ స్వీటీ అనుష్క ఫ్యాన్స్ గత కొంతకాలంగా బాగా నిరుత్సాహంగా ఉంటున్నారు. అనుష్క సినిమా రిలీజ్ అయి ఏడాది గడిచిపోవడమే ఇందుకు రీజన్. గతేడాది బాహుబలితో హిట్ కొట్టింది కానీ.. అందులో బందీగా ఓల్డేజ్ గెటప్ తో తప్ప కనిపించలేదు. ఆ తర్వాత వచ్చిన సైజ్ జీరో నిరుత్సాహపరిచింది. ఈ ఏడాది ఊపిరి.. సోగ్గాడే చిన్ని నాయన అంటూ నాగ్ సినిమాల్లో కేమియోలతో కనిపించిందంతే.

కానీ ఈ ఏడాది డిసెంబర్ నుంచి మళ్లీ అనుష్క టైమ్ మొదలైపోతోంది. మొదట సింగం3లో సూర్య భార్యగా కనిపించనుంది. శృతిహాసన్ కూడా ఈ మూవీలో చేసినా.. మొదటి రెండు పార్ట్స్ ప్రకారం చూస్కుంటే.. అనుష్కకే లీడ్ రోల్ ఉంటుంది. ఎస్3 డిసెంబర్ 16న విడుదల కానుండగా.. ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ అంటూ నాగ్-రాఘవేంద్రరావు మూవీలో నటిస్తోంది. ఇందులో భక్తురాలిగా కనిపించనుండగా.. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండింటి తర్వాత బాహుబలి ది కంక్లూజన్ 2017 ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. బాహుబలి సెకండ్ పార్ట్ లో అనుష్క నటించిన దేవసేన కేరక్టర్ డామినేషన్ చాలానే ఉంటుంది.

పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న భాగమతి కూడా నెక్ట్స్ సమ్మర్ సీజన్ లోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇన్నాళ్లూ డీలా పడ్డ స్వీటీ ఫ్యాన్స్ కి వరుసగా 4 సినిమాలతో పండగ సీజన్ మొదలైపోనుందన్న మాట.

Categories: Movie News

Leave A Reply

Your email address will not be published.